Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ట్వంటీ-20: భారత ప్రాబబుల్స్ జట్టు ఎంపిక

Webdunia
వచ్చే జూన్ నెలలో ఇంగ్లండ్ గడ్డపై జరుగనున్న ప్రపంచ ట్వంటీ-20 ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే భారత జట్టు కోసం ఎంపిక చేసిన 30 మంది ప్రాబబుల్స్‌‌ జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ ప్రాబబుల్స్ జట్టులో క్రితంసారి ఆడిన పేస్ బౌలర్లు జోగీందర్ శర్మ, ఎస్.శ్రీశాంత్‌లకు స్థానం లభించలేదు.

తొలి ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్న జట్టు సభ్యులందరూ గల ఈ ప్రాబబుల్స్ జాబితాలో పియూష్ చావ్లా, అజిత్ అగార్కర్‌లకు చోటు దక్కలేదు. కాలి మడమ గాయం నుంచి శ్రీశాంత్ కోలుకుంటుండగా, శర్మ, చావ్లా, అగార్కర్‌లను ఎంపిక చేయకపోవడానికి కారణాలు తెలియరాలేదు. అయితే, ఎనిమిది నెలల విరామం తర్వాత రాబిన్ ఉతప్పకు జాతీయ జట్టులో మళ్లీ స్థానం లభించింది.

ప్రాబబుల్స్ వివరాలు.. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, ధోనీ, సురేష్ రైనా, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, మునాఫ్ పటేల్, రవీంధ్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓఝా, హర్భజన్ సింగ్, ప్రవీణ్ కుమార్, దినేష్ కార్తీక్, ఎం.విజయ్, ఎ.రహానె, ఎస్.బద్రినాథ్, రాబిన్ ఉతప్ప, విరాట్ కోహ్లి, మనోజ్ తివారి, వృద్ధిమాన్ సాహా, అభిషేక్ నాయర్, అమిత్ మిశ్రా, ఆర్.అశ్విన్, ఆర్.పి.సింగ్, ఎల్.బాలాజీ, ధావల్ కులకర్ణి, నామన్ ఓఝాలు ఉన్నారు. ఈ 30 మంది ప్రాబబుల్స్ సభ్యుల నుంచి తుది జట్టుకు అవసరమైన 15 మంది సభ్యులను జాతీయ సెలక్టర్లు ఎంపిక చేస్తారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments