Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి చోటా తీవ్రవాద సమస్య ఉంది: పీసీబీ

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరో దేశంలో నిర్వహించాలని నిర్ణయించడంతో ప్రతి చోటా తీవ్రవాద సమస్య ఉందనే విషయం తేటతెల్లమవుతోందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) వ్యాఖ్యానించింది. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా ఎక్కడైనా తీవ్రవాదుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా భద్రత అనేది ప్రధాన సమ్యగా ఉంది. తీవ్రవాదులు ఏ దేశంలోనైనా ఘాతుకానికి పాల్పడవచ్చు. భారత్ నుంచి ఐపీఎల్‌ను తరలించడం తమ వాదనకు బలం చేకూర్చుతోందని పీసీబీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇలాంటి తరుణంలో పాక్‌లోని భద్రతా ప్రమాణాలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆందోళన వ్యక్తం చేయడం పక్షపాతంతో కూడుకుందన్నారు.

పాక్‌లో పర్యటించే ప్రతి విదేశీ జట్టుకు అవసరమైన భద్రతను బోర్డు కల్పిస్తుందని స్పష్టం చేశారు. తమ దేశంలో క్రికెట్ క్రీడను పరిరక్షించేందుకు అన్ని టెస్ట్ దేశాల సహాయం కోరుతున్నామని, తమ అభ్యర్థనను అన్ని దేశాలు అర్థం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్‌ టోర్నీలో తమ ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments