Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేలవమైన బ్యాటింగ్‌ వల్లే ఓటమి: అష్రాఫుల్

Webdunia
ట్వంటీ-20 ప్రపంచ కప్ నుంచి తాము నిష్క్రమించడానికి ప్రధాన కారణం ఆటగాళ్ళ పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనే అని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు కెప్టెన్ అష్రాఫుల్ అన్నాడు. ముఖ్యంగా తమ జట్టు బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ టోర్నీలో బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో గ్రూపు దశలోనే నిష్క్రమించింది. దీనిపై అష్రాఫుల్ మాట్లాడుతూ, బ్యాటింగ్‌లో సరిగా రాణించలేక పోవడం వల్లే మేం దెబ్బతిన్నాం. తొలి పది ఓవర్లలో 60 పరుగులు చేయాలని నిర్ణయించాం. పక్కా ప్రణాళికతోనే టోర్నీలో అడుగుపెట్టాం. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఈ పని చేస్తే, మిగిలిన పనిని బౌలర్లు పూర్తి చేస్తారని భావించారన్నారు.

అలాగే, తాము అనుకున్నట్టుగానే లక్ష్యాలను చేరుకున్నాం. అయితే, రెగ్యులర్‌గా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ నష్టం జరిగిందన్నాడు. భారత్ వంటి జట్లపై వరుసగా పరుగులు చేయలేని పక్షంలో ఖచ్చితంగా చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.

ట్వంటీ-20 టోర్నీలో అడుగుపెట్టిన తమ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. 2007 ప్రపంచ కప్‌లో భారత్‌పై తాము సాధించిన విజయాన్ని మళ్లీ చూడాలనుకున్నాం. అది సాధ్యపడలేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments