Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ పర్యటనను రద్దు చేసుకున్న కివీస్

Webdunia
బుధవారం, 4 మార్చి 2009 (13:32 IST)
వచ్చే నవంబరు నెలలో జరుపతలపెట్టిన పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్ క్రికెట్ జట్టు బుధవారం రద్దు చేసుకుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదుల దాడి చేసిన నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్టు కివీస్ బోర్డు ప్రకటించింది. శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడి దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి జస్టిన్‌ వాగన్‌ వెల్లడించారు.

తాము పాక్‌కు వెళ్ళడం లేదు. భవిష్యత్‌లో కూడా ఏ క్రికెట్ జట్టు కూడా పాక్‌లో పర్యటించలేవని రేడియో న్యూస్‌ ప్రతినిధితో అన్నారు. అయితే, గల్ఫ్ దేశాలైన అబుదాబి వంటి తటస్థ వేదికలపై ఆడే అవకాశాలు ఉన్నట్టు ఆయన చెప్పారు. గతంలో కూడా అబుదాబిలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడినట్టు ఆయన గుర్తు చేశారు.

కాగా, గత 2002 సంవత్సరంలో న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు పాక్‌ పర్యటనలో ఉన్నప్పుడు ఆ దేశ ఆటగాళ్లు బసచేసిన హోటల్‌ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెల్సిందే. దీంతో కివీస్ పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుంది.

గడాఫీ స్టేడియం సమీపంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఆరుగురు క్రికెటర్లు గాయాలబారిన పడగా, ఆరుగురు భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. దీంతో పాక్ పర్యటనను శ్రీలంక జట్టు రద్దు చేసుకుని స్వదేశానికి సురక్షితంగా చేరుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments