Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన రద్దు

Webdunia
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు పర్యటన రద్దు అయింది. ఈ విషయాన్ని లంక క్రీడల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాక్‌లోని లాహోర్, గడాఫీ స్టేడియంలో పాక్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఆదివారం ప్రారంభమైన ఈ టెస్టులో భాగంగా మంగళవారానికి మూడో రోజుకు చేరుకుంది.

మూడో రోజు ఆట కోసం లంక క్రికెటర్లు గట్టి భద్రత మధ్య హోటల్ నుంచి లిబర్టీ చౌక్ నుంచి పోలో గ్రౌండ్ రోడ్డులో ఉన్న గడాఫీ స్టేడియానికి వస్తుండగా, గుర్తుతెలియని ఒక ముఠా దాడి చేసింది. ఈ దాడికి సుమారు 12 మంది దుండగులు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, దుండగుల ఛాయా చిత్రాలను పాక్ పోలీసులు విడుదల చేశారు.

ఇదిలావుండగా, ఈ కాల్పుల్లో ఆరుగురు శ్రీలంక క్రికెటర్లు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. లంక స్పిన్నర్ మురళీధరన్‌కు కూడా గాయమైనట్టు సమాచారం. వికెట్ కీపర్ కుమార సంగక్కర కాలుకు బుల్లెట్ గాయమైంది. గాయపడిన క్రికెటర్లకు ప్రాథమిక చికిత్స అనంతరం హోటల్‌కు తరలించారు.

కాగా, గాయపడిన వారిలో తిలాన్ సమరవీర, తరంగ పరనవితనా, కుమార సంగక్కర, అజంతా మెండీస్‌లు ఉన్నట్టు లంక మంత్రిత్వ శాఖ నిర్ధారించింది. జట్టు కెప్టెన్ మహేళ జయవర్ధనే కూడా గయపడినట్టు జట్టు మేనేజ్‌మెంట్ వెల్లడించింది.

కాగా, ఆటోమెటిక్ వెపన్స్‌తో దుండగులు ఈ దాడికి పాల్పడినట్టు పాక్ పోలీసులు వెల్లడించారు. దుండగుల్లో కొందరి ఛాయా చిత్రాలను విడుదల చేశామని వారు తెలిపారు. లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సును ధ్వంసం చేశారని చెప్పారు. దుండగుల కాల్పుల్లో ఏడుగురు పోలీసులు మరణించగా, మరో ఐదుగురు గాయపడినట్టు తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments