Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌కు 12 మిలియన్ డాలర్ల నష్టం!

Webdunia
వచ్చే 2011లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలను పాకిస్థాన్ నిర్వహించలేని పక్షంలో 12 మిలియన్ డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ కప్ టోర్నీని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్న విషయం తెల్సిందే. అయితే, గత నెలలో లాహోర్‌లోని గఢాపీ స్టేడియం వద్ద శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిగిన దాడుల నేపథ్యంలో పాక్‌లో ప్రపంచ కప్ పోటీల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

భద్రతను సాకుగా చూపి భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాలు పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో ప్రపంచ కప్ పోటీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ ఒక సెమీ ఫైనల్ మ్యాచ్‌తో సహా 16 మ్యాచ్‌లకు పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి వుంది. దీనివల్ల తమ బోర్డు సుమారు 12 మిలియన్ డాలర్ల సొమ్మును ఐసిసి నుంచి పిసిబి పొందుతుందన్నారు.

అయితే, పలు క్రికెట్ జట్లు ఇక్కడ పర్యటించేందుకు నిరాసక్తత చూపుతున్నాయి. ఇటీవల శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడితో పరిస్థితి మరింత విషమంగా మారిందని చెప్పారు. భద్రత కారణంగా పాక్‌ నిర్వహించే ప్రపంచ కప్ పోటీలను రద్దు చేస్తే ఈ మొత్తం సొమ్మును పాక్ బోర్డు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్ 22 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండగా, పాక్ 16 మ్యాచ్‌లకు, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తొమ్మిదేసి మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments