Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూఢిల్లీ చేరిన మోడీ.. టాప్ లాయర్స్‌తో భేటీ..!!

Webdunia
PTI
ఇప్పటిదాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమీషనర్‌గా పనిచేసి, సస్పెన్షన్‌కు గురైన లలిత్ మోడీ, దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ చేరుకున్నాడు. తన సస్పెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ)తో న్యాయ పోరాటానికి సిద్ధమైన మోడీ.. ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, రాం జెఠ్మలానీలతో భేటీ అయ్యాడు.

ముందుగా సాల్వేతో సమావేశమైన మోడీ, దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపాడు. ఆ తరువాత రాం జెఠ్మలానీతో సమావేశమై కొంతసేపు పలు విషయాలపై చర్చించాడు. కాగా.. ఈ సమావేశంలో ఐపీఎల్ తాజా వివాదాలపై బీసీసీఐకి షోకాజ్ నోటీస్ జారీ చేసే అంశంపై మోడీ న్యాయవాదులతో చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం మీడియా ప్రతినిధులు మోడీని కలిసి న్యాయవాదులతో భేటీ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇందులో చెప్పడానికి ఏమీ లేదనీ అన్నాడు. తాను ఏదైనా చెబుతానని మీరు ఎంతసేపు హోటల్ గది బయట వేచి చూసినా ప్రయోజనం లేదనీ, తానే విషయాలను చెప్పదల్చుకోలేదని మోడీ మీడియాకు సూటిగా తేల్చి చెప్పాడు. తాను ఢిల్లీ వచ్చింది చూస్తారనీ, వెళ్లిపోయేదీ చూస్తారనీ.. అంతేగానీ ఎలాంటి విషయాలను తననుంచి రాబట్టలేరని అన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments