Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ వన్డే: కివీస్ విజయలక్ష్యం 274

Webdunia
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్స్ రాణించారు. కివీస్ ముంగిట 274 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచారు. వర్షం కారణంగా యాభై ఓవర్ల మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదిరించారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 273 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 89 బంతుల్లో ఆరు ఫోర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డాషింగ్ ఓపెన్ వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అద్భుతంగా బ్యాటింగ్ చేసి కేవలం 39 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 66 పరుగులు చేసి, కివీస్ బౌలర్ల భరతం పట్టాడు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సచిన్, సెహ్వాగ్‌లు తొలి వికెట్‌కు 69 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. సచిన్ వ్యక్తిగత స్కోరు 20 వద్ద అవుట్ కావడంతో ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ ఆచితూచి ఆడుతూ వికెట్లు పడకుండా కాపాడాడు. మరోవైపు సెహ్వాగ్ బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వెట్టోరి బౌలింగ్‌లో భారీ షాట్‌ కొట్టగా, టేలర్ అద్భుత క్యాచ్ పట్టడంతో సెహ్వాగ్ పెవిలియన్‌కు చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 121.

తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన యువరాజ్ సింగ్ రెండు పరుగులకే రనౌట్ కావడంతో మరో పది పరుగుల అనంతరం మూడో వికెట్‌ను భారత్ కోల్పోయింది. అయితే సురేష్ రైనా, ధోనీలు మంచి సమన్వయంతో ఆడుతూ 110 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరు జట్టు సింగిల్స్ తీస్తూ, మధ్యమధ్యలో ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పెంచారు. ఫలితంగా 38 ఓవర్లలో భారత్ 273 పరుగులు చేసింది, కివీస్ బౌలర్లలో బుట్లర్, వెట్టోరి, ఇలియట్‌లు ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments