Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపియర్ టెస్టులో భారత్‌కు అగ్ని పరీక్ష: మోల్స్

Webdunia
సోమవారం, 23 మార్చి 2009 (09:51 IST)
నేపియర్‌లో ప్రారంభంకానున్న రెండో టెస్టులో భారత్‌ అగ్ని పరీక్ష ఎదురుకానుందని న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కోచ్ ఆండీ మోల్స్ జోస్యం చెప్పాడు. తొలి టెస్టు ఓటమిలో తాము చేసిన తప్పులను సరిదిద్దుకున్నామన్నారు. అందువల్ల రెండో టెస్టులో భారత్‌కు ప్రతీకారం తప్పదని మోల్స్ ధీమా వ్యక్తం చేశాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ రెండో టెస్ట్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఇప్పటికే తాము ప్రయత్నాలు మొదలు పెట్టామని చెపుతున్నాడు.

ఇందుకోసం తమ ఆటగాళ్లు మైదానంలో ఎక్కువ సేపు గడుపుతూ కఠోర సాధన చేస్తున్నారు. జట్టు కూర్పునూ సమీక్షిస్తున్నట్టు చెప్పాడు. హామిల్టన్ టెస్టులా ఏకపక్షంగా ఈ మ్యాచ్ జరగబోదని, ఖచ్చితంగా ఆ జట్టుకు కఠిన పరీక్ష ఎదురుకావడం ఖాయమని మోల్స్ అంటున్నాడు. తొలి టెస్టులో తమ జట్టులోని ఆటగాళ్లలో పలువురు బ్యాటింగ్‌లో రాణించక పోవడం తీవ్ర నిరాశకు లోను చేసిందని, ఫలితంగా ఓటమి పాలైనట్టు చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments