Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హోం శాఖతో ఐపీఎల్ నిర్వాహకుల భేటీ!

Webdunia
ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కేంద్ర హోం మంత్రి చిదంబరంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహకులు సోమవారం మరోమారు సమావేశం కానున్నారు. ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించ తలపెట్టిన ఐపీఎల్ సీజన్-2 పోటీలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రతిబంధకంగా మారిన విషయం తెల్సిందే. ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఐపీఎల్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెగేసి చెప్పాయి.

దీంతో తొలుత ప్రకటించిన ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు చేసి, హోం శాఖకు సమర్పించాయి. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్ర ప్రభుత్వాలు సవరించిన షెడ్యూల్‌ తేదీల్లో కూడా భద్రత కల్పించలేమని చేతులెత్తేశాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ, కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరంతో సోమవారం సమావేశం కానున్నారు. ఇందులో ఆటగాళ్ళ భద్రత, తేదీల ఖరాలు తదితర అంశాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

Telangana: తెలంగాణ బియ్యానికి దేశ వ్యాప్తంగా అధిక డిమాండ్: డీకే అరుణ

బీహార్ తరహాలో దేశవ్యాప్తంగా ఓటర్ల తనిఖీలు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Show comments