Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ సేనకు భద్రత పెంపు: కివీస్ బోర్డు

Webdunia
ధోనీ సేనకు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసే దిశగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న భారత ఆటగాళ్లపై ప్లాస్టిక్‌ బాటిల్‌ విసిరిన నేపథ్యంలో... మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చర్యలు చేపట్టింది.

మంగళవారం నేపియర్‌లో జరిగే మొదటి వన్డేలో భారత జట్టు భద్రతను మరింత పటిష్టం చేయనున్నట్ల న్యూజిలాండ్‌ బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జస్టిన్‌ వాన్‌ అన్నాడు. అలాగే మైదానంలో కూడా ధోనీ సేనకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తామని వాన్ చెప్పాడు.

ఆటగాళ్లపై బాటిల్ విసరడం వంటి సంఘటనలు దురదృష్టకరమని, పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టి సారిస్తూనే ఉందని వాన్ అన్నాడు. ఇందులో భాగంగానే వచ్చే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తామని వాన్ హామీ ఇచ్చాడు.

ఇదిలా ఉండగా.. మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో భారత్ రాణించే దిశగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్వంటీ-20 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన ధోనీ సేన, వన్డేల్లో గట్టిపోటీని ప్రదర్శించేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పిటికే వన్డే సిరీస్‌పై దృష్టి సారించాలని టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టు సభ్యులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్