Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో కింగ్స్ పటిష్టం: చంద్రశేఖర్

Webdunia
ఐపీఎల్ తొలి సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రెండో సీజన్‌కు పటిష్టంగా ఉందని సూపర్ కింగ్స్ సెలక్టర్, మాజీ క్రికెటర్ వి. బి. చంద్రశేఖర్ అన్నారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చెన్నై సూపర్ సింగ్స్ జట్టు బలోపేతమైందని, రెండో సీజన్‌లో తమ ఆటగాళ్లు ధీటుగా రాణిస్తారని చంద్రశేఖర్ వెల్లడించారు.

దాదాపు 27 మంది అద్భుత క్రికెటర్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ రెండో సీజన్‌కు సిద్ధంగా ఉందని చంద్రశేఖర్ అన్నారు. ఒకవేళ మైదానంలో ఆటగాళ్లు గాయాలకు గురైతే వారి స్థానంలో వేరొక క్రికెటర్‌ను బరిలోకి దింపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకున్నామని చంద్రశేఖర్ అన్నారు.

సూపర్ కింగ్స్ క్రికెటర్లకు దక్షిణాఫ్రికాలో తగిన శిక్షణను అందిస్తున్నామని చంద్రశేఖర్ వెల్లడించారు. ఏప్రిల్ 18వ తేదీన కేప్‌టౌన్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టును మట్టికరిపిస్తారని చంద్రశేఖర్ నమ్మకం వ్యక్తం చేశారు.

టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ సారథ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో.. సుదీప్ త్యాగి, పర్తీవ్ పటేల్, జోగిందర్ శర్మ, సురేష్ రైనా, మన్‌ప్రీత్ సింగ్ గోనిలతో పాటు, జార్జ్ బెయిలీ, మాథ్యూ హేడెన్, మైక్ హస్సీ (ఆస్ట్రేలియా), స్టీఫన్ ఫ్లెమ్మింగ్, జాకోబ్ ఓరమ్ (న్యూజిలాండ్), తైలాన్ తుషారా, ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక), అల్బీ మోర్కెల్, మఖాయా నితిని (దక్షిణాఫ్రికా), ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) విదేశీ ఆటగాళ్లు కూడా ఉన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments