Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్టు: పది వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం

Webdunia
సొంత గడ్డపై పర్యాటక వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు పది వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. విండీస్ నిర్ధేశించిన 32 పరుగుల విజయలక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. దీంతో రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

లార్డ్స్ మైదానంలో ఆరో తేదీన ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగియడం గమనార్హం. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 377 పరుగులకు జవాబుగా మొదటి ఇన్నింగ్స్‌ చేపట్టిన విండీస్‌ 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఫాల్‌ ఆన్‌ ఆడాల్సి వచ్చింది.

అయినప్పటికీ.. విండీస్ ఆటగాళ్ళ ఆటలో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా 256 పరుగులకు వెస్టిండీస్ జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్లు ఆండర్సన్, బ్రాడ్, స్వాన్‌ల ధాటికి విండీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. తొలి, రెండు ఇన్నింగ్స్‌లలో మూడు వికెట్లు తీసిన ఇంగ్లండ్ బౌలర్ స్వాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments