Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన బీసీసీఐ!

Webdunia
FILE
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనుమతి లేకుండా ఢిల్లీ డేర్‌డెవిల్స్ క్రికెటర్లు గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలను ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంకకు పంపడంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. దీంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు బీసీసీఐ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇంకా బీసీసీఐ అనుమతి లేకుండా గంభీర్, నెహ్రాల లంక ప్రయాణంపై ఆ జట్టు వివరణ ఇవ్వాలని సంఘం కోరింది.

ఆయుర్వేద చికిత్స కోసం శ్రీలంకకు వెళ్ళే అంశంపై గౌతం గంభీర్, ఆశిష్ నెహ్రాలు ముందుగానే బోర్డుకు తెలియజేయాల్సిన అవసరం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. కానీ బీసీసీఐ అనుమతి లేకుండా శ్రీలంకకు గంభీర్, నెహ్రా ప్రయాణం కావడంపై వారిని హెచ్చరించడంతో పాటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ యాజమాన్యం సరైన వివరణ ఇవ్వాలని బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో గంభీర్ గాయానికి గురైయ్యాడు. అనంతరం 17వతేదీ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఓవర్ల వద్ద గాయం కారణంతో మైదానం నుంచి గంభీర్ వైదొలగాడు. తదనంతరం గౌతం గంభీర్ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అలాగే మొహలీ ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో నిమగ్నమైన ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయానికి గురైయ్యాడు.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరపున ఆడుతోన్న తిలకరత్నే దిల్షాన్ సలహాతో పాటు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ప్రమేయంతో శ్రీలంకలో చికిత్స తీసుకున్న గంభీర్, నెహ్రాలు 24వ తేదీన దేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments