Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం!

Webdunia
FILE
హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. శుక్రవారం రాత్రి మొహలీలో జరిగిన 22వ లీగ్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో వరుసగా మూడో విజయం చేరింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజమ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్-డెక్కన్ ఛార్జర్స్‌ల మధ్య జరిగిన ఈ పోరులో యూసుఫ్ పఠాన్ విజృంభించి 73 పరుగులు చేయడంతో శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ విజయభేరి మోగించింది.

ఫలితంగా ఐపీఎల్-2 టైటిల్ విజేత, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డక్కన్‌ ఛార్జర్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. టైట్ బౌలింగ్‌లో రాణించి మూడు వికెట్లు తీసుకోగా బ్యాటింగ్‌లో 'ట్రంప్‌కార్డ్‌' యూసుఫ్‌ పఠాన్‌ విజృంభించి 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ సునాయాస విజయం నమోదు చేసుకుంది.

ఐపీఎల్-3లో మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిపోయిన రాజస్థాన్‌ తరువాత జరిగిన మూడు మ్యాచ్‌ ల్లోనూ గెలుపొంది తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ పట్టికల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన డెక్కన్‌ ఛార్జర్స్‌ 9 వికెట్ల నష్టానికి 148 పరు గులు చేయగా, రాజస్థాన్‌ 15.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 151 పరుగులు చేసింది. యూసుఫ్‌ పఠాన్‌ను మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ప్రకటించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments