Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 మ్యాచ్: కివీస్ విజయలక్ష్యం 163

Webdunia
క్రెస్ట్‌చర్చిలో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత జట్టు కివీస్ ముంగిట 163 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. కాగా, టీమ్ ఇండియాలో 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లలో 61 పరుగులతో రాణించిన రైనా, జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ వెట్టోరి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభం అదిరింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 10 బంతులు ఎదుర్కొన్న సెహ్వాగ్ నాలుగు ఫోర్లతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు గంభీర్ (6) పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన రైనా నింపాదిగా ఆడసాగాడు. అయితే.. శర్మ (7), యువరాజ్ సింగ్ (1) ధోనీ (2)లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 61 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లను కోల్పోయింది. అనంతరం రైనాతో జతకలిసిన యూసుఫ్ పఠాన్ ఎనిమిది బంతుల్లో 20 పరుగులు చేసి జట్టు స్కోరు వేగాన్ని పెంచాడు.

మెక్‌కల్లమ్ బౌలింగ్‌లో వరుసగా నాలుగో సిక్స్‌కు ప్రయత్నించిన యూసుఫ్.. బౌండరీలైన్ వద్ద జాకబ్ ఓరమ్ అద్భుత క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 82 పరుగులు. అయితే ఒక వైపు క్రీజ్‌లో నిలదొక్కుకున్న రైనాతో ఇర్ఫాన్ పఠాన్ కలిసి జట్టు స్కోరును వంద దాటించి, పఠాన్ అవుట్ అయ్యాడు.

క్రీజ్‌లోకి వచ్చిన హర్భజన్ 22 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే ఓవర్లు ముగియడంతో భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సురేష్ రైనా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో బ్రియాన్, బట్లర్‌లు రెండేసి వికెట్లు తీయగా, సౌథీ, వెట్టోరి, మెక్‌కల్లమ్, రైడర్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments