Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 ప్రపంచకప్: ఆస్ట్రేలియా అద్భుత విజయం!

Webdunia
FILE
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్, సూపర్-8‌లో భాగంగా శ్రీలంకపై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లో ఆదివారం జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై 81 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది.

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.2 ఓవర్లలోనే ఆలౌటై 87 పరుగులకే కుప్పకూలింది. దీంతో కంగారూలు 87 పరుగుల తేడాతో లంకేయులపై గెలిచారు.

ఇకపోతే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో వైట్ (89) 49 బంతుల్లో ఆరు సిక్సర్లు, ఆరు బౌండరీలతో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అలాగే మైక్ హస్సీ కూడా 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39పరుగులు సాధించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరును సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లలో ఓ ఒక్క బ్యాట్స్‌మెనూ ధీటుగా రాణించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.

మరోవైపు.. శ్రీలంక బౌలర్లలో రాందివ్ మూడు వికెట్లు తీసుకోగా, మాథ్యూస్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలాగే ఆసీస్ బౌలర్లలో జాన్సన్ మూడు, ననేన్స్ రెండు, స్మిత్ రెండు, క్లార్క్ ఒక వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా.. శ్రీలంక బౌలర్లను ఆటాడుకున్న ఆసీస్ బ్యాట్స్‌మెన్ వైట్ (85 నాటౌట్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments