Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్ట్ ఓడిపోతామనే ఆలోచనే లేదు: సెహ్వాగ్

Webdunia
నేపియర్ టెస్టును తాము ఓడిపోతామనే ఆలోచనే లేదని 'టీమ్ ఇండియా' రెండో టెస్టుకు స్టాండ్‌బై కెప్టెన్‌గా వ్యవహరించిన వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. తమకు ఫాలోఆన్‌ను అప్పగించిన వెంటనే పరిస్థితి ఇండియాకు ప్రతికూలంగా ఉందని అందరూ భావించారని, అయితే, తమకు మాత్రం ఓటమి ఊహే రాలేదన్నాడు. నేపియర్‌లోని మెక్‌లీన్ పార్కులో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టును భారత్ డ్రాగా ముగించుకున్న విషయం తెల్సిందే.

కివీస్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 314 పరుగులు వెనుకబడి ఫాలోఆన్‌తో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. జట్టులోని ఓపెనర్ సెహ్వాగ్ మినహా, గంభీర్, ద్రావిడ్, సచిన్, లక్ష్మణ్, యువరాజ్ సింగ్‌లు బాధ్యతాయుతంగా రాణించడంతో భారత్ ఓటమి కోరల నుంచి బయటపడింది.

ఈ మ్యాచ్ అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ.. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించినా టెస్ట్‌ను తాము కాపాడుకోగలమనే విశ్వాసం, ఆత్మస్థైర్యం తమలో ఉన్నదన్నారు. లక్ష్మణ్, ద్రవిడ్, సచిన్, గంభీర్ వంటి బ్యాట్స్‌మెన్స్‌ను కలిగిన జట్టుపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావన్నారు.

2001, 2004 లో జరిగిన సిరీస్‌లలో ఆస్ట్రేలియాతో ఇటువంటి పరిస్థితి నుంచి గట్టెక్కామని సెహ్వాగ్ గుర్తు చేశాడు. ఇటీవలి కాలంలో తమ జట్టు స్వదేశంలోనే కాకూండా, విదేశాల్లో సైతం విజయాలు సాధించడంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలమన్న విశ్వాసం తమకు ఉందని చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments