Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెస్టు ర్యాంకింగ్స్: నెం.1 స్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా!

Webdunia
అంతర్జాతీయ క్రికెట్ బోర్డు (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా తన నెం.1 స్థానాన్ని నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌‌ను సమం చేసుకోవడంతో ఒక్క పాయింట్ కోల్పోయినప్పటికీ మహేంద్ర సింగ్ ధోనీ సేన 128 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. అలాగే దక్షిణాఫ్రికా 117 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది.

ఇక యాషెస్ సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ (115) మూడు పాయింట్లు ఎగబాకి మూడో స్థానంలో నిలవగా, యాషెస్ సిరీస్‌లో పేలవమైన ఆటతీరులో ఓటమి చెందిన ఆస్ట్రేలియా (107) ఐదో స్థానానికి పడిపోయింది. తద్వారా శ్రీలంక 109 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది.

అలాగే ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జాక్వస్ కలిస్‌లకు అగ్రస్థానం దక్కింది. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌‍లో వీరిద్దరూ 883 పాయింట్లతో సంయుక్తంగా తొలి స్థానంలో నిలవగా.. సంగక్కర కేవలం ఒక్క పాయింట్ వెనకబడి మూడో స్థానానికి చేరాడు.

కేప్‌టౌన్‌లో జరిగిన చివరి టెస్టులో 146 పరుగులు చేసిన సచిన్ రెండో టెస్టులోనూ రికార్డు (50వ) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. అటు కలిస్ కూడా రెండు సెంచరీలు (161, 109 నాటౌట్) చేసి ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి టాప్‌కు చేరాడు. టెస్టుల్లో నెంబర్‌వన్ స్థానానికి చేరుకోవడం సచిన్‌కిది పదోసారి. 1994లో తొలిసారి ఈ ఘనత సాధించాడు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments