Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాఫర్ సెంచరీ: డియోధర్ ట్రోఫీ వెస్ట్ జోన్ కైవసం

Webdunia
కెప్టెన్ వసీం జాఫర్ (118) రాణించడంతో బుధవారం జరిగిన డియోధర్ ట్రోఫీ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో ఈస్ట్ జోన్‌పై 218 పరుగుల భారీ తేడాతో వెస్ట్ జోన్ విజయం సాధించింది. దీంతో డియోధర్ ట్రోఫీ వెస్ట్ జోన్ వశమైంది. వెస్ట్ జోన్‌కు ఇది తొమ్మిదో డియోధర్ ట్రోఫీ కావడం గమనార్హం.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్ట్ జోన్ కెప్టెన్ వసీం జాఫర్ 108 బంతుల్లో 116 పరుగులు చేసి జట్టు భారీ స్కోరుకు బాటలు వేశాడు. జాఫర్‌తోపాటు చేతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ (86 బంతుల్లో 94 పరుగులు) సాధించడంతో వెస్ట్ జోన్‌కు ఫైనల్ వన్డేలో భారీ స్కోరుకు అవకాశం లభించింది.

భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఈస్ట్ జోన్ 39.4 ఓవర్లలో 144 పరుగులకే ఆలౌటయింది. అంతకుముందు ఈస్ట్ జోన్ బౌలింగ్ ప్రభావవంతంగా లేకపోవడంతో వెస్ట్ జోన్ బ్యాట్స్‌మెన్ రవీంద్ర జడేజా (61 నాటౌట్), అభిషేక్ నాయర్ (54 నాటౌట్) చెలరేగి ఆడారు. చివరి ఏడు ఓవర్లలో 99 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

Show comments