Webdunia - Bharat's app for daily news and videos

Install App

జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తా: అక్తర్

Webdunia
మోకాలి గాయం కారణంగా, గత జనవరిలో శ్రీలంక ఆఖరి వన్డేతో పాచు టెస్టు సిరీస్‌కు దూరమైన పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ తిరిగి జట్టులో చోటు సంపాదించడం కోసం తీవ్రంగా శ్రమిస్తానని అంటున్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి రావాలని అక్తర్ ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.

ఈ విషయమై అక్తర్ మాట్లాడుతూ.. మోకాలి గాయం నుంచి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని చెప్పాడు. ఇక బౌలింగ్‌లో గట్టి ఆటతీరును తిరిగి పొందేందుకు, తీవ్రంగా శ్రమిస్తున్నానని అక్తర్ తెలిపాడు. బౌలింగ్‌లో అదే లయని తిరిగి పుచ్చుకున్నట్లైతే, ఫామ్‌లో పడినట్లే అవుతుందని అక్తర్ అన్నాడు.

ఆస్ట్రేలియా జట్టును ప్రస్తుత పరిస్థితిల్లో ఓడించడం సులభమని, తప్పకుండా జట్టులో స్థానం దొరికితే ధీటుగా రాణిస్తానని అక్తర్ వెల్లడించాడు. నాలుగేళ్ల క్రితం ఆసీస్‌ మంచి ఫామ్‌లో ఉన్నదని, ప్రస్తుతం ఆ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమవుతోందని, తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో ఓడిందని అక్తర్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు.

ఇదిలా ఉండగా.. ఇప్పటికే తన ఫిట్‌నెస్‌ను అంచనా వేసేందుకు సలీమ్ జాఫర్‌ను పీసీబీ ప్రత్యేకంగా నియమించింది. యూఎఈలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్‌లో అక్తర్‌తో పాటు మహ్మద్ యూసఫ్ కూడా జట్టులో ఉండాలని పాక్ జట్టు సారథి యూనిస్ ఖాన్ కోరుకుంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments