Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైతో ఛాలెంజర్స్: ఢిల్లీతో రాజస్థాన్‌ సమరం నేడే!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా బుధవారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే 28వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌తో తలపడుతుంది. చెన్నైలో జరిగే ఈ మ్యాచ్‌లో కుంబ్లే సేనపై గట్టిపోటీని ప్రదర్శించాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది.

రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటికే ఆరింటిలో నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండు విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌కు గాయాలతో స్టార్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం జట్టును బాధిస్తోం ది. దీంతో ధోనీ సేన సెమీస్‌కు చేరాలంటే మిగిలిన ఏడు మ్యాచుల్లో కనీసం ఆరు నెగ్గాల్సి ఉంది.

ఇకపోతే.. బుధవారం రాత్రి 7.30 గంటలకు ముంబైలో జరిగే 29వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ పుంజుకునే అవకాశం ఉంది. కానీ సొంత గడ్డపై తొలిలీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌‌ చేతిలో ఓటమిని రుచిచూసిన రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రతీకార పోరుకు సిద్ధమైంది. దీంతో ఇరుజట్ల మధ్య బుధవారం షిరోజ్‌షా కోట్లా మైదానంలో ఆసక్తికరమైన పోరు జరగనుంది.

కాగా ఐపీఎల్ పట్టికలో శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలతో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ కూడా నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

ఆంధ్ర కింగ్ తాలూకా లో సినిమా అభిమానిగా రామ్ పోతినేని

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Show comments