Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రెస్ట్‌చర్చ్ మైదానంలో "సిక్స్‌"ల మోత

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2009 (14:58 IST)
న్యూజిలాండ్‌లోని క్రెస్ట్‌చర్చ్‌ మైదానం సిక్స్‌ల మోతతో హోరెత్తిపోయింది. ఈ మైదానంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు పోటీ పడి సిక్స్‌ల వర్షం కురిపించారు. దీంతో ట్వంటీ-20 ఫార్మెట్‌లో అత్యధికి సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌గా క్రెస్ట్‌చర్చ్ ట్వంటీ-20 సరికొత్త రికార్డు సృష్టించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇన్నింగ్స్‌లో 13 సిక్స్‌లు, కివీస్ ఇన్నింగ్స్‌లో 11 సిక్స్‌లు ఆటగాళ్ళ బ్యాట్ల నుంచి జాలువారాయి. టీమ్ ఇండియాలో ఓపెనర్ సెహ్వాగ్ 4, సురేష్ రైనా 5, యూసుఫ్ పఠాన్ మూడు, రోహిత్ శర్మ ఒకటి సిక్స్‌లు బాదారు. అలాగే ఆతిథ్య కివీస్ జట్టులో ఓపెనర్ మెక్‌కల్లమ్, గుప్తిల్, టేలర్‌లు మూడేసి, జాకబ్ ఓరమ్ రెండు సిక్స్‌లు చొప్పున కొట్టారు.

కాగా, భారత ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, కివీస్ ఇన్నింగ్స్‌లో పది ఫోర్లు కలిపి మొత్తం 16 సార్లు బంతి బౌండరీని ముద్దాడగా, సిక్స్‌ల రూపంలో 24 సార్లు బంతి స్టేడియంలోని స్టాండ్స్‌లలో పడటం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Show comments