Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆధిక్యం

Webdunia
స్వదేశంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలోనూ ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో ముందుకు దూసుకెళుతోంది.

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరిగింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 32.1 ఓవర్స్‌కు కుదించారు. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు గిబ్స్ (74), ఆమ్లా (34)లు రాణించి, తొలి వికెట్‌కు 66 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

ఆ తర్వాత 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు వరుణుడు మరోమారు అడ్డుతగిలాడు. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని 20 ఓవర్లలో 137 పరుగులుగా నిర్ణయించారు.

ఓఏషా (44) కెప్టెన్ పీటర్సన్ (40), ఫ్లింటాఫ్‌ (31) రాణించడంతో మరో 14 బంతులు మిగిలి వుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments