Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకేఆర్ ఆఫీసులో కీలక పత్రాలు లభ్యం: ఐటీ అధికారులు

Webdunia
PTI
ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు కోల్‌‌కతా నైట్ రైడర్స్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభ్యమైనట్లు ఐటీ శాఖాధికారులు తెలిపారు. ఈ పత్రాల ద్వారా ఐపీఎల్-కేకేఆర్‌-సీఏబీల మధ్య ఆర్థిక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా డాక్యుమెంట్ల ఆధారంగా సమగ్ర దర్యాప్తును కొనసాగిస్తామని వారు వెల్లడించారు.

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లోని కేకేఆర్ ఆఫీసు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాల్లో బుధవారం ఐటీ శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం అర్థరాత్రికి తర్వాత ఒంటి గంటకు ఈ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఐపీఎల్-కేకేఆర్‌లు మధ్య గల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కీలక పత్రాలను కైవసం చేసుకున్నట్లు ఐటీ అధికారి యాదవ్ తెలిపారు.

కాగా.. ఐపీఎల్ ప్రారంభమైన గత మూడేళ్లలో ఛైర్మన్ లలిత్ మోడీ భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. లలిత్ మోడీ గుట్టు రట్టు చేసేందుకు కీలక ఆధారాల కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, డెక్కన్ ఛార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ల కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు దాడులు జరిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

Show comments