Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్ వన్డే జట్టులో మిల్స్, బట్లర్‌లు..!

Webdunia
టీం ఇండియాతో స్వదేశంలో ఐదు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు న్యూజిలాండ్‌ వన్డే జట్టును ఆ దేశ క్రికెట్‌ బోర్డు శనివారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన రెండు ట్వంటీ20 మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించిన ఫాస్ట్ బౌలర్ ఇయాన్ బట్లర్.. సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకోగా, కైల్ మిల్స్ కూడా జట్టుకు ఎంపికయ్యాడు.

ఇయాన్ ఓ బ్రయాన్, బట్లర్, టిమ్ సౌథీలతో కూడిన కివీస్ పేస్ దళంలోకి రెండువారాల తరువాత మిల్స్ మళ్లీ వచ్చిచేరాడు. అలాగే గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉండి... ట్వంటీ20లో ఆడిన జాకబ్‌ ఓరమ్‌, పీటర్ ఫుల్టన్ స్థానంలో తిరిగి తుది జట్టుకు ఎంపికయ్యాడు.

వీరితోపాటు బ్రెండన్ దియామంటి స్థానంలో జెస్సీ రైడర్ జట్టులో చోటు సంపాదించాడు. ఇక... ట్వంటీ20 మ్యాచ్‌లలో విఫలమైన నాథన్‌ మెక్‌కల్లమ్‌, థామ్సన్‌‌లకు వన్డే జట్టులో చోటు లభించలేదు. అలాగే, ఆఫ్‌స్పిన్నర్ జీతన్ పటేల్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments