Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌ మాస్టర్స్ జట్టులో ఆడనున్న సచిన్

Webdunia
టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వికెట్‌కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్‌లు శుక్రవారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్ల తరపున ఆడనున్నారు. వెల్లింగ్టన్ వెస్ట్‌ప్యాక్ స్టేడియంలో జరిగే ట్వంటీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో తలపడే కివీస్ జట్టులో సచిన్ టెండూల్కర్ పాల్గొంటున్నాడు.

నిధుల సేకరణ కోసం నిర్వహించతలపెట్టిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియా వన్డే జట్టు సభ్యులైన సచిన్, దినేశ్ కార్తీక్‌లు ఆడేందుకు న్యూజిలాండ్ క్రికెటర్ల సంఘం అంగీకరించింది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ (ఎన్‌జెడ్‌సీపీఎ)తో జరిపిన చర్చల్లో సచిన్‌ కివీస్ మాస్టర్స్ జట్టులో, దినేశ్ కార్తీక్ ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టులో ఆడే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు.

ఈ విషయాన్ని టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ మీడియాకు వెల్లడిస్తూ... మాస్టర్స్ జట్లలో టీం ఇండియా సభ్యులకు చోటు దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ట్వంటీ20 మ్యాచ్‌లో కివీస్ మాజీ క్రికెటర్లు స్టీఫెన్ ఫ్లెమింగ్, డియాన్ నాష్, డారెన్ లీమన్, ఇయాన్ హీలీ తదితరులు కూడా ఆడనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

Show comments