Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ-20: పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం!

Webdunia
PTI
కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20లో భాగంగా.. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెయింట్ లూసియా మైదానంలో జరిగిన గ్రూప్-ఎ ఆరో మ్యాచ్‌లో షేన్‌వాట్సన్ (81) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా గెలుపొందింది.

తొలుత టాస్ గెలిచి బ్యాంటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ఓపెనర్ షేన్ వాట్సన్ 49 బంతుల్లో నాలుగు బౌండరీలు ఒక సిక్సర్‌తో 81 పరుగుల సాధించి జట్టును గెలిపించాడు.

అలాగే షేన్‌వాట్సన్‌-డేవిడ్ హస్సీ (53)ల భాగస్వామ్యంతో ఆసీస్ మూడో వికెట్‌కు 98 పరుగులు సాధించింది. వార్నర్ (26), మైక్‌హస్సీ (17) మినహా ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. ఫలితంగా 191 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది.

అనంతరం ఆస్ట్రేలియా నిర్ధేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాకిస్థాన్ విఫలమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 151 పరుగులకే పాకిస్థాన్ కుప్పకూలింది. ఫలితంగా ఆస్ట్రేలియాకే విజయం దక్కింది. కాగా.. 81 పరుగులతో అదరగొట్టి షేన్ వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇకపోతే.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ నెగ్గడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments