Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టీ-20: వార్మప్ మ్యాచ్‌ల్లో సత్తా చాటనున్న బ్రెట్ లీ!?

Webdunia
PTI
కరేబియన్ గడ్డపై ఈ నెల 29న ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌షిప్‌కు ప్రపంచ దేశాలకు చెందిన క్రికెట్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఈ మినీ టోర్నమెంట్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే వెస్టిండీస్ చేరుకుంది.

క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా.. వార్మప్ మ్యాచ్‌ల్లోనే తన సత్తా ఏంటో చూపించాలని తహతహలాడుతోంది. ఇందుకుగాను పేస్ బౌలర్ బ్రెట్ లీ లాంటి ఆటగాళ్లను రంగంలోకి దించనుంది.

ఫలితంగా ఇంతకాలం గాయాలతో అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమైన బ్రెట్ లీ వార్మప్ మ్యాచ్‌ల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని తహతహలాడుతున్నాడు. జింబాబ్వేలో ఈ నెల 27వ జింబాబ్వే తొలి వార్మప్ మ్యాచ్‌లో పోటీ పడనున్న ఆస్ట్రేలియా జట్టు, రెండో మ్యాచ్‌ను విన్వార్డ్ ఐలాండ్స్ జట్టుతో ఏప్రిల్ 29వ తేదీన ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లు సెయింట్ లూసియాలో జరుగుతాయి.

ఐసీసీ ట్వంటీ-20 "ఏ" గ్రూప్‌లో ఆస్ట్రేలియా మే రెండో తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్‌తో తలపడుతుంది, అలాగే మే ఐదో తేదీన జరిగే రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగుతోంది.

ఈ నేపథ్యంలో బ్రెట్ లీ లాంటి బౌలర్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ల జోరుకు బ్రేక్ వేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ భావిస్తోంది. దీంతో బ్రెట్ లీ వార్మప్ మ్యాచ్‌లో తన సత్తా ఏమిటో? నిరూపించుకోవాల్సి ఉంది.

కాగా.. పేస్ బౌలర్ బ్రెట్ లీ, టైట్, డర్క్ నేనన్స్, మిట్చెల్ జాన్సన్ వంటి ఆటగాళ్లు క్రీజులో రాణిస్తారని ఆసీస్ కోచ్ టిమ్ నిల్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గాయాల కారణంగా ఐపీఎల్-3లో తిరిగి రంగ ప్రవేశం చేసిన బ్రెట్ లీ కూడా ఐసీసీ ట్వంటీ-20లో అద్భుతంగా ఆడుతాడని నిల్సన్ నమ్మకం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments