Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: రాజస్థాన్ రాయల్స్‌కు రెండో విజయం

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్, 19.1 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఐపీఎల్-3‌లో రాయల్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ సంగక్కర ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు మిచెల్ లుంబ్ 41, ఫజల్ 45 పరుగులతో ధీమాగా ఆడారు. ఆ తరువాత యూసుఫ్ 28, వోజెస్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలవటంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. పంజాబ్ బౌలర్లలో ఇర్ఫాన్ భారీగా పరుగులివ్వగా.. శ్రీశాంత్, చావ్లా ఒక్కో వికెట్ పడగొట్టారు.

తదనంతరం రాజస్థాన్ విధించిన లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పంజాబ్ ఓపెనర్లు బొపారా, సంగక్కరలు కళ్లు చెదిరే ఆరంభాన్నిచ్చారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన మన్విందర్ బిస్లా మెరుపు ఇన్నింగ్స్‌తో 9.3 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును అధిగమించి, వార్న్ సేన విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగానే అధిగమిస్తుందని అనిపించేలా చేసింది. అయితే యువరాజ్, బొపారా, ఇర్ఫాన్ వికెట్లను పడగొట్టిన రాజస్థాన్ బౌలర్లు పంజాబ్ విజయాన్ని కష్టతరం చేశారు.

ఈ దశలో కైఫ్‌తో సహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు అవుట్ చేసేందుకు రాజస్థాన్‌కు పెద్దగా సమయం పట్టలేదు. ఈ క్రమంలో చివరి 7 వికెట్లను పంజాబ్ 45 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా.. మ్యాచ్ చివరి ఓవర్ వరకు కొనసాగిన ఫజల్, వోజెస్‌లు 6.1 ఓవర్లలోనే చకచకా 60 పరుగులు సాధించడంతో పంజాబ్ 152 స్కోరు చేసినా ప్రయోజనం లేకపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments