Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: ముంబై ఇండియన్స్‌తో ధోనీ సమరం రేపే!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోన్న సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌తో.. చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన 8 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయాన్ని, కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పరాజయాన్ని చవిచూసిన ముంబై ఇండియన్స్ జట్టు.. ధోనీ సేన మట్టి కరిపించే దిశగా బరిలోకి దిగుతోంది.

కానీ.. రాజస్థాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన 32వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్ అత్యధిక పరుగుల రికార్డును సృష్టించింది. రాయల్స్‌పై గెలుపొందిన జోరుతో ఉన్న చెన్నై ముంబై ఇండియన్స్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాయల్స్ జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన మోర్కెల్, విజయ్‌ల బ్యాటింగ్ శైలి.. ముంబైని కూడా ఓడిస్తుందని చెన్నై భావిస్తోంది.

అయితే ప్రస్తుతం 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ముంబై ఇండియన్స్‌ను నాలుగో స్థానంలో ఉన్న ధోనీ సేన నెగ్గడం సులభం కాదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునే దిశగా ముంబై ఇండియన్స్ ప్రతి మ్యాచ్‌లోనూ రాణిస్తోందని వారు అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడోసీజన్‌లో సచిన్ టెండూల్కర్ సేన రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో మాత్రమే ఓటమిని చవిచూసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

బ్లాక్ బ్యూటీ మిస్ వరల్డ్ శాన్ రేచల్ ఆత్మహత్య

ప్రొఫెసర్ వేధిస్తున్నాడని చెప్పినా పట్టించుకోరా? కాలేజీలో నిప్పంటించుకున్న యువతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Shankar: అవతార్ లాగా తన కలల ప్రాజెక్ట్ వేల్పారి చేయబోతున్న తమిళ శంకర్

Show comments