Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: బెంగళూరు-ఢిల్లీ జట్ల మధ్య సమరం నేడే..!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య లీగ్ మ్యాచ్ జరుగనుంది. వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న బెంగళూరు జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపుపై ధీమా ఉంది. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచినా, ఆ తరువాత వరుస ఓటములతో సతమతమవుతున్న ఢిల్లీ, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలుపొందాలనే పట్టుదలతో ఉంది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్ గౌతం గంభీర్ గాయాల బారిన పడటంతో ఆ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడిపోయింది. ఈ జట్టులో డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కడే మెరుగ్గా రాణిస్తుంటే, మిగతా ఆటగాళ్లు విఫలం అవుతున్నారు. దీంతో ఆ జట్టును ఓటమి వీడటం లేదు. ఐపీఎల్-2లో సత్తా చాటుకున్న డివిలియర్స్ మూడో అంచె పోటీలలో మాత్రం అంతంమాత్రంగానే రాణిస్తున్నాడు. దీంతో ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్‌లో గెలుపొందాలంటే గట్టి పోరాటమే చేయాల్సి ఉంది.

మరోవైపు బెంగళూర్‌ జట్టు నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లలో సమతూకంగా ఉన్న ఈ జట్టులో కలిస్‌ అద్భుత ఫామ్‌తో చెలరేగి ఆడుతున్నాడు.

ఐపీఎల్-3లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లలో చాలా వాటిలో అతను ఒంటి చేత్తో జట్టుకి విజయాన్ని అందించాడంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ జట్టులో మనీష్‌ పాండే, ఊతప్ప కూడా నిలకడగా రాణిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో వినయ్‌, ప్రవీణ్‌ మెరుపులు మెరిపిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు ఢిల్లీకే మెరుగ్గా ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments