Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగిన సంగక్కర సేన వరుస విజయాలతో ప్రత్యర్థి జట్టులను హడలెత్తింపజేస్తోంది. ఆదివారం ఢిల్లీతో జరిగిన 44వ లీగ్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకోగా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ వరుసగా రెండో ఓటమిని రుచిచూసింది.

తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకొన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ 19.4 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 18.4 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది.

పంజాబ్ ఆటగాళ్లలో ఓపెనర్‌గా దిగిన ఇర్ఫాన్‌ 17 బంతుల్లో ఒక ఫోర్‌తో 12 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలో జయవర్ధనేతో కలిసి తొలి వికెట్‌కు 41 పరుగులు చేశాడు. మరోవైపు జయవర్ధనే బాధ్యతాయుతంగా ఆడిన జయవర్ధనే 35 బంతుల్లో నాలుగు ఫోర్లు, సిక్స్‌తో 38 పరుగులు సాధించాడు. కెప్టెన్ సంగక్ర (33), యువరాజ్‌ సింగ్‌ (21 పరుగులతో నాటౌట్‌)లు రాణించడంతో పంజాబ్ కింగ్స్ గెలుపును సొంతం చేసుకున్నారు.

ఢిల్లీ ఆటగాళ్లలో ఓపెనర్ తొలి బంతికే పెవిలియన్ ముఖం పట్టాడు. మరోవైపు ధాటిగా ఆడిన గంభీర్‌ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచేందుకు ప్రయత్నించాడు. 12 బంతుల్లోనే 5ఫోర్లతో 26 పరుగులు చేసిన గంభీర్‌ లేని పరుగు కోసం వెళ్లి రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ రెండో వికెట్ పతనానికి 38 పరుగులను నమోదు చేసుకుంది. కానీ తర్వాత క్రీజులోకి దిగిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్లకు పంజాబ్ బౌలర్లు అడ్డుకట్ట వేయడంతో ఢిల్లీ 111 పరుగులకే కుప్పకూలింది.

ఇకపోతే.. పంజాబ్ బౌలర్లలో ఇర్ఫాన్‌ మూడు, చావ్లా రెండువికెట్లు తీశారు. అలాగే యువరాజ్ సింగ్, థెరాన్, అబ్‌లిష్ తలా ఒక్కో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టిన చావ్లాకు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments