Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: నేడు చెన్నై-డెక్కన్ ఛార్జర్స్ ఢీ..!!

Webdunia
FILE
వరుసగా ఐదు ఓటముల తరువాత దక్కిన సూపర్ డూపర్ గెలుపుతో డెక్కన్ ఛార్జర్స్ జట్టు శనివారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో హోరాహోరి తలపడనుంది. ఇదివరకు ఆడిన పది మ్యాచ్‌లలో ఆరింటిలో ఓటమిని చవిచూసిన డీసీ జట్టుకు సెమీ ఫైనల్ ఆశలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే గత మ్యాచ్‌లో బెంగళూరు జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందటంతో మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న డీసీ, ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి, చెన్నై సెమీస్ అవకాశాలను దెబ్బతీయాలని గట్టి పట్టుదలతో ఉంది.

డీసీ జట్టులో బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేకపోయినప్పటికీ, ఆ జట్టులోని ప్రజ్ఞాన్ ఓజా మాత్రం బాగా రాణిస్తున్నాడు. ఇప్పటిదాకా 15 వికెట్లు తీసిన ఓజా ఐపీఎల్ పట్టికలో టాప్ ర్యాంకర్‌గా ఉన్నాడు. ఇక బ్యాటింగ్ లైనప్ మాత్రం పటిష్టంగానే ఉందని చెప్పవచ్చు. గిల్లీకి సరైన ఓపెనింగ్ జోడీ దొరకక పోయినప్పటికీ, ఆండ్రూ సైమండ్స్ ఆల్‌రౌండర్ ప్రతిభ డెక్కన్ ఛార్జర్స్‌కు జట్టుకు కాస్తంత ఊరటనిస్తోందని చెప్పవచ్చు.

ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. చివరి మూడు మ్యాచ్‌లలో బెంగళూరు, రాజస్థాన్, ముంబయి ఇండియన్స్ లాంటి పటిష్టమైన జట్లనే మట్టిగరిపించింది. కాబట్టి.. చెన్నైని ఈ మ్యాచ్‌లో ఓడించాలంటే, డెక్కన్ ఛార్జర్స్ చెమటోడ్చి ఆడాల్సిందే. హేడెన్, ధోనీ లాంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న చెన్నైపై గెలుపొందేందుకు డీసీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కాగా.. చెన్నై ఇదివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 5 గెలుపు, 5 ఓటములతో ఐపీఎల్ పట్టికలో మొత్తం 10 పాయింట్లతో కొనసాగుతోంది. అయితే సెమీస్‌కు అర్హత సాధించాలంటే మాత్రం ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments