Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్-3: కేకేఆర్‌తో డేర్‌డెవిల్స్ కీలక సమరం రేపే!

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా సౌరవ్ గంగూలీ సేన కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తలపడనుంది. కోల్‌కతా వేదికగా బుధవారం జరిగే 39వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో గౌతం గంభీర్ సేన కేకేఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే 12 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్.. కేకేఆర్‌పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐపీఎల్ మూడో సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన గౌతం గంభీర్ సేన డేర్‌డెవిల్స్ ఆరింటిలో విజయాలను, మిగిలిన మూడింటిలో పరాజయాల్ని చవిచూసింది. కాగా.. సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకునేందుకు గంగూలీ సేనపై నెగ్గి తీరాలని ఢిల్లీ భావిస్తోంది.

మరోవైపు ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్, నాలుగింటిలో విజయాలు, మిగిలిన ఐదింటిలో ఓటమిని చవిచూసింది. దీంతో ప్రతి మ్యాచ్‌ను నెగ్గి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మూడో సీజన్‌లో విజయపరంపరను కొనసాగిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. 8 మ్యాచ్‌లాడిన సచిన్ సేన కేవలం ఒక్క ఓటమిని మాత్రమే రుచిచూసి.. 14 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఫలితంగా సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది.

అయితే.. బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఫ్రాంచైజీ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సెమీఫైనల్ బెర్త్‌ను చేతులారా పోగొట్టుకుంది. కానీ ఆదివారం జరిగిన 34వ లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఎట్టకేలకు విజయం సాధించింది. ఇదే తరహాలో బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే 38వ లీగ్ మ్యాచ్‌లోనూ నెగ్గాలని భావిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments