Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధం..!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. సెమీఫైనల్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ముంబైలో జరుగనున్న ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌లకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉండటంతో.. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై స్టేడియం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.

మరోవైపు.. బెంగళూరు నుంచి భద్రతా కారణాల దృష్ట్యా ముంబైకి తరలించిన ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్‌ల టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చునని ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ సెమీఫైనల్లో భాగంగా.. ముంబైలోని డి.వై. పాటిల్ స్టేడియంలో తొలి రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను వీక్షించాలనుకునే అభిమానులు, ప్రేక్షకులు డి.వై. పాటిల్ స్టేడియం కార్యాలయంలోనూ లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐపీఎల్‌టీ20.కామ్ అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

ఇంకా టిక్కెట్ ధరను వందరూపాయలుగా నిర్ణయించారు. అలాగే ఏప్రిల్ 24వ తేదీన జరిగే చివరి సెమీఫైనల్ మ్యాచ్‌తో పాటు, ఏప్రిల్ 25వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు కూడా ఇదే పద్ధతిలో టిక్కెట్లను పొందవచ్చునని ఐపీఎల్ యాజమాన్యం ఓ ప్రకటనలో వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments