Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ సమరం: పంజాబ్‌ కింగ్స్‌తో సచిన్ సేన ఢీ నేడే..!

Webdunia
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో భాగంగా 27వ లీగ్‌ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది.

పీఎల్ మూడో సీజన్‌లో విజయపరంపరను కొనసాగిస్తున్న ముంబై ఇండియన్స్, ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో కూడా గెలుపును నమోదు చేసుకోవాలని తహతహలాడుతోంది.

మరోవైపు ఐపీఎల్-3లో పరాజయాలతో కొట్టిమిట్టాడుతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై ఇండియన్స్‌పై ధీటుగా రాణించడం సందేహమేనని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

ప్రస్తుతం ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో ముందంజలో ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కేవలం ఒకే ఒక్క ఓటమితో విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ ఈసారి టైటిల్‌ను నెగ్గడమే లక్ష్యంగా రాణిస్తోంది.

కానీ పంజాబ్ కింగ్స్ జట్టును కెప్టెన్ మార్పు వెంటాడుతోంది. గత ఏడాది కేకేఆర్‌ను కెప్టెన్సీ మార్పు ఎలా వేధించిందో.. అదే తరహాలో ఈసారి పంజాబ్‌కు కూడా చుక్కెదురైంది. దీంతో ప్రస్తుతం ఆరు మ్యాచ్‌లాడిన పంజాబ్ కేవలం ఒక్క విజయాన్ని మాత్రమే నమోదు చేసుకోవడం గమనార్హం. ఫలితంగా ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనసాగుతోంది.

కాగా.. మంగళవారం రాత్రి ఏడుగంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ధీటుగా రాణించే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments