Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరయు అమీన్!

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2010 (12:49 IST)
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరయు అమీన్ ఎంపికయ్యారు. భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీపై వేటు వేసిన బీసీసీఐ, పనిలో పనిగా ఐపీఎల్ తాత్కాలిక ఛైర్మన్‌గా చిరయు అమీన్‌ను నియమించింది. దీంతో లలిత్ మోడీ ఐపీఎల్ ఛైర్మన్ పదవిలో కొనసాగుతారా? లేదా? అనే అంశంపై వారం రోజుల పాటు నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

కాగా లలిత్ మోడీ వ్యవహారంపై ఐపీఎల్ పాలకమండలి సమావేశం సోమవారం ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో లలిత్ మోడీ అవకతవకలకు సంబంధించిన కీలక అంశాలపై అధికారులు చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇంకా ఐపీఎల్ వ్యవహారాలపై స్వేచ్ఛగా విచారణ జరిపేందుకే మోడీని ఛైర్మన్ పదవి నుంచి సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అన్నారు. దీంతో పాటు బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరయు అమిన్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఇకపోతే ఐపీఎల్ నాలుగో సీజన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరుగు సభ్యులతో కూడిన మధ్యంతర కమిటీని ఐపీఎల్ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో రవిశాస్త్రి, గవాస్కర్‌, పటౌడీలతో పాటు మరో ముగ్గురు సభ్యులున్నారు. అలాగే లలిత్ మోడీకి ఇచ్చిన ఛార్జ్ షీట్‌లో బీసీసీఐ 22 అభియోగాలను చేర్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments