Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టోర్నీ వేదికగా ఇంగ్లండ్: లలిత్ మోడీ

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ పోటీలకు ఇంగ్లండ్‌ను వేదికగా ఖరారు చేసినట్టు ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ వెల్లడించారు. ఇందుకోసం ఆయన హుటాహుటిన సోమవారం ఇంగ్లండ్‌కు బయలుదేరి వెళ్లారు. లండన్ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ రెండో సీజన్ పోటీలను నిర్వహించేందుకు సరైన వేదిక ఇంగ్లండ్ అని చెప్పారు. భారీ షెడ్యూలుకు అనుగుణంగా మ్యాచ్‌లు నిర్వహించే వీలు ఇక్కడ ఉందన్నారు.

ఇతర వేదికలతో పోల్చితే ఇంగ్లాండ్‌ వాతావరణం ఐపీఎల్‌కు సరిగ్గా సరిపోతుందన్నారు. అయితే వేదికగా ఇంగ్లండ్‌ను ఖరారు చేసినట్టు ఆయన స్పష్టమైన, అధికారపూర్వక సమాచారం మాత్రం ఇవ్వలేదు. దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని మెలిక పెట్టారు. అదే సమయంలో ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు ఇటు ఇంగ్లండ్, అటు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చు గురించి తాము ఆలోచించడం లేదని లలిత్ మోడీ స్పష్టం చేశారు. టోర్నీని భారత్‌ నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు తీసుకున్న నిర్ణయం తమను బాధిస్తోందన్నారు. అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. భారత్‌లోనే మ్యాచ్‌ల నిర్వహణకు తాము ప్రయత్నించామని, అయితే ఎన్నికల కారణంగా భద్రత కల్పించలేమని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చి చెప్పడం వల్లే ఈ పరిస్థితులు ఉత్పన్నమైనట్టు మోడీ వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments