Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌‌లో ఆటను కొనసాగిస్తా..!: సచిన్ టెండూల్కర్

Webdunia
PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ-20 ఛాంపియన్‌షిప్‌లో ఆటను కొనసాగిస్తానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ప్రస్తుతానికి అంతర్జాతీయ ట్వంటీ-20 ఆడట్లేదని నిర్ణయించుకున్న తాను, స్వదేశంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఆడుతానని సీనియర్ బ్యాట్స్‌మెన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. తొలిసారిగా సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ 22 పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ను క్రికెటర్లందరూ ప్రత్యేక టోర్నమెంట్‌గా భావిస్తున్నారన్నాడు. ఇంకా వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ నాలుగో సీజన్‌లోనూ ఆడుతానని సచిన్ స్పష్టం చేశాడు. అదేవిధంగా ఐపీఎల్‌లో ఆడటం రోజు రోజుకి కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పాడు. ఐపీఎల్ ఆడటం ఎంతో సంతోషాన్నిచ్చిందని సచిన్ వెల్లడించాడు. క్రికెట్ ఆడటం అంటే తనకెంతో ఇష్టమని మాస్టర్ తెలిపాడు.

ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్ చేతిలో ఓడిపోవడంపై సచిన్ మాట్లాడుతూ.. తమ జట్టు పేలవమైన ఫీల్డింగ్‌ కొంపముంచిందన్నాడు. డి.వై.పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తమ జట్టు ఆటగాళ్లు ప్రదర్శించిన ఫీల్డింగ్ మెరుగ్గా లేదని వాపోయాడు.

అలాగే రెండు కీలక మ్యాచ్‌లను చేజార్చుకోవడం, పరుగుల సాధనలోనూ రాణించలేకపోవడంతోనే చెన్నై చేతిలో ఓడామని సచిన్ అన్నాడు. ఒకవేళ రెండు కీలక క్యాచ్‌లను చేజార్చుకోకుండా ఉండి ఉంటే, ముంబై ఇండియన్స్‌ను విజయం వరించేదని సచిన్ తెలియజేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

Show comments