Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు: పాక్ క్రికెటర్లు

Webdunia
FILE
భారత దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌కు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గిపోదని పాకిస్థాన్ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు సోహైల్, మియాందాద్‌లు అన్నారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం ఎలాంటి పరిణామాలకు దారితీసినా, ఐపీఎల్ టోర్నీ మాత్రం ఏనాటికీ తన ప్రభావాన్ని కోల్పోదని అమీర్ సోహైల్, జావెద్ మియాందాద్‌లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కొచ్చి ఫ్రాంచైజీల వ్యవహారంతో పాటు ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా.. మోడీ స్థానంలో ఎవరైనా నాయకత్వం వహించినా, ఐపీఎల్ భవితవ్యానికి ఎలాంటి ముప్పు వాటిల్లదని పాక్ క్రికెటర్లు చెప్పారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న గందరగోళం కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా.. ఐపీఎల్ టోర్నీకి మాత్రం ప్రేక్షకులకు, అభిమానుల మధ్య మంచి క్రేజ్ లభిస్తుందని పాక్ మాజీ కెప్టెన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఐపీఎల్‌లో లలిత్ మోడీ అవకతవకల విషయం ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని, అయినా ఈ వ్యవహారం అంతా బీసీసీఐ, ఐసీసీలు చూసుకుంటాయని పాక్ కెప్టెన్లు వెల్లడించారు.

కానీ ఐపీఎల్ వంటి భారీ లీగ్‌ను నడుపుతున్న వ్యక్తి అన్ని ఆర్థిక వ్యవహారాలను, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను తన అదుపులో ఉంచుకోలేదని చెప్పడం సబబు కాదని పాక్ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ఐపీఎల్‌లో నెలకొన్న సంక్షోభం మున్ముందు ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కానీ, దాని ప్రాభవం మరింత పెరుగుతుందేగానీ ఏ మాత్రం తగ్గదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments