Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదో వన్డే: కష్టాల్లో పడిన భారత్

Webdunia
శనివారం, 14 మార్చి 2009 (09:43 IST)
ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ 90 పరుగులకు 4 కీలక వికెట్లను కోల్పోయిన కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలనుకున్నారు. అయితే విజయోత్సాహంతో ఈ మ్యాచ్‌లోను కొనసాగుతామని భారత జట్టు ఆటగాళ్లు కోరారని.. అందుకే నాలుగో వన్డేలో పాల్గొన్న జట్టునే బరిలోకి దించుతున్నట్లు కోచ్ కిర్‌స్టెన్ వెల్లడించారు.

దీంతో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. న్యూజిలాండ్ కూడా దాదాపు మార్పులు లేకుండానే మైదానంలోకి అడుగుపెట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గంభీర్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు.

ఆ తర్వాత సురేష్ రైనా (8) కూడా వెంటనే వికెట్ కోల్పోయాడు. సహచరులు వెనువెంటనే అవుట్ అవ్వడంతో.. నిగ్రహం కోల్పోయిన సెహ్వాగ్ 27 బంతుల్లో 40 పరుగులతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ తరుణంలో సెహ్వాగ్... ఓరమ్ బౌలింగ్‌లో మెక్‌కల్లుమ్ చేతికి చిక్కాడు. సెహ్వాగ్ అవుట్ అవ్వడంతో.. న్యూజిలాండ్ ఊపిరిపీల్చుకుంది.

ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రాణించని యువరాజ్ ఈ మ్యాచ్‌లోను నిరుత్సాహపరిచాడు. రైడర్ బౌలింగ్‌లో కీపర్ మెక్‌గ్రాషన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మా (9), ధోనీ (0)లు ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఓరమ్‌కు 2 వికెట్లు, మిల్స్‌, రైడర్ చెరోవికెట్ చొప్పున తీసుకున్నరు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments