Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రోజు రాత్రిలోగా ఐపీఎల్‌పై నిర్ణయం: లలిత్ మోడి

Webdunia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ వేదికపై మంగళవారం రాత్రిలోగా నిర్ణయం తీసుకుంటామని ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడి వెల్లడించారు. ఆయన సోమవారం ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికా బయలుదేరి వెళుతున్న సందర్భంగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. దీనిపై రేపు రాత్రిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఐపీఎల్ టోర్నీని నిర్వహించేందుకు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వేదికలను పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండింటిలో ఏదో ఒక దానిని వేదికగా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తాను ఇప్పటికే ఐపీఎల్ గురించి క్రికెట్ సౌతాఫ్రికా సీఈవో గెరాల్డ్ మజోలాతో మాట్లాడానని, జోహనెస్‌బర్గ్‌లో మంగళవారం ఉదయం సమగ్ర చర్చలు జరుపుతానని తెలిపారు.

ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తున్నాము. ఈ అంశమే ప్రస్తుతానికి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా రెండు దేశాల్లోనూ భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆస్ట్రేలియా పర్యటన ఏప్రిల్ మధ్యకాలంలో ముగుస్తుంది. రెండు దేశాలకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, వీటిని పరిశీలించడానికి అక్కడికి వెళుతున్నట్లు మోడి వెల్లడించారు. ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా రెండూ ఉత్సాహం చూపుతున్నాయని చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments