Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలా జరుగుతుందని అనుకోలేదు : మోర్గాన్

Webdunia
శ్రీలంక క్రికెటర్లకు పాకిస్థాన్‌లో ఆశించిన స్థాయిలో భద్రత కల్పించడంలో... ఆ దేశ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు డేవిడ్ మోర్గాన్ ఆరోపించాడు.

అధ్యక్ష స్థాయి భద్రత కల్పిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెప్పిన మాటలను లంకతో పాటు తాము కూడా సంతృప్తి చెందామనీ... కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించలేకపోయామని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. క్రికెటర్లపై ఉగ్రవాదుల దాడి జరిగిన సమయంలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపించాయని ఆయన వాపోయాడు.

ఏఫ్రిల్ 17వ తేదీన దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ సంఘటనపై ఇరు జట్ల ప్రతినిధుల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకుంటామని మోర్గాన్ వివరించారు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భద్రతా బాధ్యత ఆతిథ్య దేశాలదేననీ, ఇందులో ఐసీసీని తప్పుబట్టేందుకు ఏమీ లేదని ఆయన స్పష్టం చేశాడు.

ఇదిలా ఉంటే... ఈ దాడి వల్ల తమ దేశ క్రికెట్ భవిత ప్రశ్నార్థకంగా మారిందని పాక్ క్రికెటర్లు ఆందోళనపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... విదేశాలలోనూ, తటస్థ వేదికలలోనూ పాక్ క్రికెట్ ఆడేందుకు తమ సహకారం అందజేస్తామని మోర్గాన్ అంటున్నాడు. మోర్గాన్ చెప్పిన ఈ సమాధానం పాక్ క్రికెటర్లలో కాస్తంతైనా ఊరటను కలిగిస్తుందని ఆశిద్దాం..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments