Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ క్రికెట్‌కు గంభీర్ "సెకండ్ వాల్": సెహ్వాగ్

Webdunia
భారత క్రికెట్‌కు టీం ఇండియా ఓపెనర్ గౌతం గంభీర్ "సెకండ్ వాల్" అని తాత్కాలిక కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. న్యూజిలాండ్‌తో నేపియర్‌లో జరిగిన రెండో టెస్టులో గంభీర్ ఆటతీరు, భారత్‌ను గట్టెక్కించిందని సెహ్వాగ్ చెప్పాడు.

న్యూజిలాండ్‌తో నేపియర్‌‍లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ సమయం క్రీజ్‌లో ఉండి గంభీర్ 137 పరుగులు సాధించాడు. అంతేకాకుండా మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో బాగా వెనుకబడి, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీం ఇండియాను గంభీర్ ఆదుకున్నాడు. మూడు రోజుల్లో సుమారు 11 గంటలపాటు క్రీజ్‌లో ఉండి ఆతిథ్య జట్టు నుంచి భారత్‌కు ఓటమిని తప్పించాడు. దీనిపై మ్యాచ్ ముగిసిన అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఆటను మెరుగుపరుచుకున్నాననే విషయాన్ని గంభీర్ ఈ మ్యాచ్ ద్వారా చాటాడన్నాడు.

ద్రావిడ్‌లాగా మ్యాచ్‌లను తాను కూడా కాపాడగలనని గంభీర్ నిరూపించాడని, ఇప్పటికే భారత క్రికెట్‌లో ద్రావిడ్‌ను "ది వాల్"గా పిలుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గంభీర్‌ను సెహ్వాగ్ రెండో గోడగా సెహ్వాగ్ అభివర్ణించాడు. గంభీర్ ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నాడు. దూకుడుకు కళ్లెం వేసి, అనుభవంతో నేర్చుకుంటున్నాడని సెహ్వాగ్ చెప్పాడు.

తొలి ఇన్నింగ్స్‌లో మేము బ్యాటింగ్ సరిగ్గా చేయలేదు. అయితే రెండో ఇన్నింగ్స్ మెరుగ్గా ఆడాము. ముఖ్యంగా గౌతం గంభీర్, వీవీఎస్ లక్ష్మణ్ బాగా బ్యాటింగ్ చేశారు. సుమారు 11 గంటలపాటు బ్యాటింగ్ చేసి గంభీర్ మ్యాచ్‌ను కాపాడాడు. న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కట్టడి చేసేందుకు బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే వారికి పిచ్ నుంచి ఎటువంటి సహకారం లభించలేదని సెహ్వాగ్ అన్నాడు.

ఇదిలా ఉండగా.. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 619 పరుగుల భారీ స్కోరును సాధించిన సంగతి తెలిసిందే. కేవలం 305 పరుగులకే ఆలౌట్ అయి, ఫాలో ఆన్‌లో బరిలోకి దిగిన టీం ఇండియా, చివరి రోజైన సోమవారం గంభీర్, లక్ష్మణ్, ద్రావిడ్ సచిన్‌లు బాధ్యతాయుతంగా ఆడటంతో 476 స్కోరును సాధించి, టెస్టును డ్రాగా ముగించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments