Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఓటమితో భయపడాల్సిన అవసరం లేదు: సచిన్

Webdunia
PTI
మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ముంబై ఇండియన్స్ 24 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మూడో సీజన్‌లో భాగంగా మంగళవారం రాత్రి 37వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలవడంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోవడం ఒకందుకు మేలేనని చెబుతున్నాడు.

కానీ ఈ పరాజయంతో భయపడాల్సిన అవసరం లేదని జట్టు సభ్యులకు సచిన్ సూచించాడు. వరుస పరాజయాలతో ముందుకు దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ ఆటతీరులో ఇంకా మెలకువ వహించాలని చెప్పే రీతిలో ఈ ఓటమి తమ జట్టును మేల్కొలిపిందని సచిన్ వ్యాఖ్యానించాడు.

తమ జట్టు ఫీల్డింగ్, బ్యాటింగ్ తీరును ఇంకా మెరుగు పరుచుకోవాలని, కానీ తప్పకుండా తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాణిస్తుందని కెప్టెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ధోనీసేన అద్భుతంగా ఆడిందని సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా ప్రశంసించాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments