Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్ఘన్‌ను అంత తక్కువగా అంచనా వేయలేం..!: ధోనీ

Webdunia
PTI
ప్రతిష్టాత్మక ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌కు కొత్తగా అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ను అంత తక్కువగా అంచనా వేయలేమని టీం ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐసీసీ ట్వంటీ-20కి అర్హత సాధించిన ఆప్ఘనిస్థాన్‌ను క్రికెట్ పసికూనగా అంచనా వేయడం లేదని ధోనీ స్పష్టం చేశాడు.

ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్ తన తొలి మ్యాచ్‌లో టీం ఇండియాతో బరిలోకి దిగనుంది. మే ఒకటో తేదీన జరిగే ఈ మ్యాచ్‌లో తమ జట్టు సమిష్టిగా రాణించాలని ధోనీ జట్టు సభ్యులకు పిలుపునిచ్చాడు. ఇంకా ఈ మ్యాచ్‌లో ఏదైనా తప్పులు దొర్లితే మాత్రం సూపర్ 8‌కి అర్హత సాధించడం కష్టమని ధోనీ హెచ్చరించాడు. ఐసీసీ ట్వంటీ-20లో ఏ జట్టునైనా ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగాలని కెప్టెన్ సూచించాడు.

ఆప్ఘనిస్థాన్ జట్టు గురించి తనకు ఎక్కువ తెలియదని ధోనీ అన్నాడు. అయితే ఆప్ఘనిస్థాన్ గురించి తెలుసుకోకపోవడం మంచిదేనని, తెలిసే ఆ జట్టు సభ్యుల ఆటతీరు గురించి ఎక్కువగా ఆలోచించాల్సి ఉంటుందన్నాడు. కానీ ట్వంటీ-20 పోరులో ఏ జట్టుతో ఆడినా గెలవడమే ప్రధాన లక్ష్యంగా తమ జట్టు సన్నద్ధంగా ఉందని కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments