Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయేషాతో నాకు శారీరక సంబంధంలేదు: షోయబ్ మాలిక్

Webdunia
PTI
అయేషాతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ అంటున్నాడు. నిన్నటి వరకు అయేషా ఎవరనే విషయం తెలియదని, ఆమెతో ఫోన్‌లో మాత్రమే నిఖా చేసుకున్నానని, తనను ఆమే మోసం చేసిందంటూ క్షణానికో మాట మారుస్తున్న షోయబ్, తాజాగా అయేషా చేతిలో తానే మోసపోయానని పోలీసుల విచారణలో అన్నాడు. పాస్‌పోర్ట్ స్వాధీనంపై పాక్ ఎంబసీకి ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.

షోయబ్‌తో కలిసి పాకిస్థాన్ రెసిడెన్సీ హోటళ్లో మూడు రోజుల పాటు గడిపానని, అతని వల్ల గర్భవతిని కూడా అయ్యాయని అయేషా పోలీసుల విచారణలలో చెప్పింది. అయితే ఇవన్నీ నిజం కాదని పాక్ రెసిడెన్సీ హోటల్‌కు కేవలం డిన్నర్‌ చేసేందుకు మాత్రమే వెళ్లామని మాలిక్ వెల్లడించాడు. తప్పుడు ఫోటోలు, నిఖానామాలో ఫోర్జరీ సంతకాలతో ఆమె తనను మోసం చేసిందని మాలిక్ తెలిపాడు.

సానియాతో పెళ్లికి అభ్యంతరం లేదు: అయేష ా
ఇదిలా ఉంటే.. షోయబ్ మాలిక్‌ స్నేహంతో గర్భవతిని అయినప్పటికీ అబార్షన్ చేయించుకున్నానని అయేషా చెప్పింది. షోయబ్‌తో 2002లో వివాహం జరిగిందని, మాలిక్ హైదరాబాద్ వస్తే మా ఇంట్లో ఉండేవాడని అయేషా పోలీసుల విచారణలో తెలిపింది. కాగా.. భారత టెన్నిస్ స్టార్ సానియాను మాలిక్ వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అయేషా స్పష్టం చేసింది.

కానీ షోయబ్ మాలిక్ నుంచి తాము ఎలాంటి డబ్బును ఆశించడం లేదని, విడాకులు మాత్రమే కోరుతున్నామని అయేషా కుటుంబసభ్యులు పోలీసుల విచారణలో కోరారు. ఇంకా అయేషాకు జరిగిన అన్యాయానికి షోయబ్ మాలిక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments