Webdunia - Bharat's app for daily news and videos

Install App

హజెల్ కీచ్‌తో క్రికెటర్ యువరాజ్ సింగ్ పెళ్లి...

భారత సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన పెళ్లి సమయాన్ని ప్రకటించాడు. యూవీ సంవత్సర కాలంగా హజెల్ కీచ్‌తో ప్రేమాయాణం సాగిస్తున్నాడు. అయితే ఇరువురు తాజాగా పెళ్లికి సిద్దమయ్యారు. వీరి పెళ్లి గురించి పలు పుకార

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2016 (09:35 IST)
భారత సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన పెళ్లి సమయాన్ని ప్రకటించాడు. యూవీ సంవత్సర కాలంగా హజెల్ కీచ్‌తో ప్రేమాయాణం సాగిస్తున్నాడు. అయితే ఇరువురు తాజాగా పెళ్లికి సిద్దమయ్యారు. వీరి పెళ్లి గురించి పలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీటికి యూవీ జంట ఫుల్‌స్టాప్ పెట్టేసింది. తమ పెళ్లి ఈ ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో జరగనున్నట్టు యువీ తెలిపిన సంగతి తెలిసిందే. నటి హజెల్‌ కీచ్‌ను యువీ నవంబరు 30న వివాహమాడనున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు.
 
''డిసెంబరు 5 నుంచి 7 మధ్య రిసెప్షన్‌ ఉంటుందని అంటున్నారు. గత నవంబరులో బాలిలో యువీ-కీచ్‌ల నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడన్నదానిపై వూహాగానాలు సాగుతున్నాయి. ''గత మూడేళ్లుగా యువరాజ్‌కు హజెల్‌ మధ్య పరిచయం ఉన్న సంగతి తెలిసిందే. కానీ నిశ్చితార్థానికి మూడు నెలల ముందు నుంచి మాత్రమే వాళ్లు డేటింగ్‌ చేస్తున్నారు. 2016 శీతాకాలంలో పెళ్లి చేసుకోనున్నట్లు వాళ్లు ప్రకటించారు'' అని యువీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
 
కేన్సర్‌తో పోరాడి విజయం సాధించి.. జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న యువరాజ్ సింగ్ వివాహంపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. వీళ్ళు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని.. దాంపత్యం కూడా చేస్తున్నారంటూ పుకార్లు షికార్లు కూడా చేశాయి. ఈ నేపథ్యంలో స్వయంగా యువరాజ్ వివాహ ప్రకటన చేయడం విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

తర్వాతి కథనం
Show comments