Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ వల్లే అంతా జరిగింది.. నెమ్మదిగా ఆడాడు: యోగ్‌రాజ్

Webdunia
శనివారం, 13 జులై 2019 (13:00 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సెమీఫైనల్ పోరులో రనౌట్ కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో ఓటమితో ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్థానం ముగిసింది. ఆ వెంటనే భారత జట్టు స్వదేశానికి పయనం కావాల్సి ఉండగా టికెట్లు లేక భారత జట్టు లండన్‌లో ఉండిపోయింది. 
 
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమికి ధోనీయే కారణమని నిందించాడు. కీలక ఓవర్లలో నెమ్మదిగా ఆడుతూ రవీంద్ర జడేజాపై ఒత్తిడి తీసుకొచ్చాడని ఫలితంగా భారీ షాట్‌కు యత్నించి జడేజా అవుటయ్యాడని తెలిపాడు. 
 
జడేజా భారీ షాట్లు ఆడుతుంటే ధోనీ నెమ్మదిగా ఆడాడని విమర్శించాడు. రవీంద్ర జడేజా 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు ధాటిగా ఆడమని చెప్పి అతడి అవుట్‌‌కు కారణమయ్యాడని వాపోయాడు. స్పిన్నర్లపై దాడి చేయాలంటూ పాండ్యాకు చెప్పాడని యోగ్‌రాజ్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

తర్వాతి కథనం
Show comments